పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకొని… రెచ్చగొట్టారు
విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించాలనుకున్న జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకొని అనవసర రగడ సృష్టించారని సీసీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ను టార్టెట్ చేసుకొని జన సైనికులను రెచ్చగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో వైసీపీ నేతలు చేపట్టిన విశాఖ గర్జనకు ఎలాంటి ఆటంకాలు సృష్టించని పోలీసులు, జనసేన జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకున్నారని ఆక్షేపించారు. అమరావతి విషయంలో సీఎం జగన్ మాట తప్పి మోసం చేశారని మండిపడ్డారు. దున్నుపోతు మీద వర్షం పడిన చందంగా జగన్ పాలన సాగుతోందని విమర్శించారు.













