ఈ విషయంలో తాను పశ్చాత్తాపం : నారాయణ
తిరుపతిలో ప్రముఖ సినీనటుడు చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలను భాషాదోషంగా పరిగణించాలని సీసీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో తాను పశ్చాత్తాప పడుతున్నట్లు తెలిపారు. నా వ్యాఖ్యలతో చిరంజీవి అభిమానులు, కాపు మహానాడు నేతలు కొంత మందికి బాధ, మరికొంత మందికి ఆవేశం కలిగిందన్నారు. వారి బాధను నేను అర్థం చేసుకోగలను. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. అవిలేకుండా రాజకీయాలు ఉండవు. ఆ ప్రకారం నేను మాట్లాడిన మాటలు వాస్తవమే. రాజకీయ భాషను మించి చిరంజీవి గురించి మాట్లాడిన దాన్ని భాషా దోషంగా పరిగణించాలన్నారు. ఆ అంశాన్ని ఇక్కడితో వదిలేయాలి అని అన్నారు.













