ఉక్రెయిన్, రష్యా వివాదంలో.. అమెరికా జోక్యం తగదు
ఉక్రెయిన్, రష్యాల మధ్య వివాదంలో అమెరికా జోక్యం తగదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్ దేశాలు యుద్ధంతో కాకుండా సామసర్యంగా సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. దేశ సంపదను అదానీ, అంబానీలకు కట్ట పెట్టడానికి మోదీ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఎర్రజెండా పార్టీలను విమర్శించడం మానేసి ఎన్నికల అజెండా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు హితవు పలికారు.













