Krishnam Raju: వీవీఆర్ కృష్ణంరాజుకు 14 రోజుల రిమాండ్
రాజధాని అమరావతి మహిళలపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన కేసులో పాత్రికేయుడు వీవీఆర్ కృష్ణంరాజు (Krishnam Raju)కు మంగళగిరి కోర్టు (Mangalagiri Court) 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 26 వరకు అతడికి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న విశాఖ (Visakhapatnam) లో అరెస్టు చేసిన తుళ్లూరు పోలీసులు అతడిని గురువారం మధ్యాహ్నం మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 26వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో అతడిని గుంటూరు జైలు (Guntur Jail)కు తరలించారు.













