Liquor Scam: మద్యం కుంభకోణం.. నిందితులకు ఎదురుదెబ్బ

వైసీపీ హయాంలో జరిగిన మధ్యం, కుంభకోణం కేసులో నిందితులకు ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy) , ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి(Krishnamohan Reddy), బాలాజీ గోవిందప్ప (Balaji Govindappa) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. వీరి పిటిషన్లపై ఇటీవల వాదనలు ముగించిన న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించింది. ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవిస్తూ బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. వీరితో పాటు వాసుదేవరెడ్డి (Vasudeva Reddy) , సత్యప్రసాద్ (Satya Prasad) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లనూ కోర్టు కొట్టివేసింది.