భూమా అఖిల ప్రియకు చుక్కెదురు
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు కోర్టులో చుక్కెదురైంది. ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను సికింద్రాబాద్ కోర్టు తిరస్కరించింది. అఖిలప్రియ మెడికల్ రిపోర్టును చంచల్గూడ జైలు అధికారులు కోర్టుకు సమర్పించారు. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. మరోవైపు ఈ కేసులో లోతుగా విచారించేందుకు అఖిలప్రియను కస్టడీకి అప్పగించాలన్న పోలీసుల విజ్ఞప్తిని కోర్టు అనుమతిచ్చింది. అయితే 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు అడగ్గా మూడు రోజులు మాత్రమే కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. నేటి నుంచి 13 వరకూ అఖిలప్రియను కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారించనున్నారు. బోయిన్పల్లి అపరహరణ కేసులో రిమాండ్ ఖైదీగా అఖిలప్రియ ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న విషయం తెలిసిందే.













