ఏపీలో 1525 పాజిటివ్ కేసులు
ఆంధప్రదేశ్‌లో గత 24 గంటల్లో 5943 నమూనాలను పరీక్షించగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1525కు చేరుకుందని తెలిపింది. కోవిడ్ బాధితుల్లో తాజాగా 38 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని, దీంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 441 కు చేరుకుందని పేర్కొంది. వైరస్ బారినపడి రాష్ట్రంలో ఇప్పటివరకు 33 మంది మరణించారని, గడిచిన 24 గంటల్లో ఎటువంటి కోవిడ్ మరణాలు సంభవించలేదని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా 25 కర్నూలు జిల్లాలో నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1051 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వెల్లడించింది.













