ఏపీలో 1177కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ఆంధప్రదేశ్‌లో గత 24 గంటల్లో 6517 శాంపిల్స్‌ను పరీక్షించగా, 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1177కు చేరిందని తెలిపింది. వైరస్ బారినపడి రాష్ట్రంలో ఇప్పటి వరకు 31 మంది మరణించారని, 235 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 911 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆరోగ్యశాఖ పేర్కొంది. గడిచిన 24 గంటల్లో ఎటువంటి కోవిడ్ మరణాలు సంభవించలేదని వెల్లడించింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో నలుగురు రాజ్‌భవన్ సిబ్బందికి కరోనా సోకినట్టు ఆరోగ్యశాఖ పేర్కొంది.













