ఏపీలో 757కి చేరిన కరోనా కేసులు
ఆంధప్రదేశ్‌లో కొత్తగా మరో 35 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 757కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్ అధికారి మంగళవారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో 10, వైఎస్సార్ కడప జిల్లాలో 6, అనంతపురం జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 9, కృష్ణా జిల్లాలో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 కరోనా కేసులు నమోదైనట్టు తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 96 మంది డిశ్చార్జ్ కాగా, 22 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 639 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.













