ఏపీలో 722కు చేరిన కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వెల్లడించింది. తాజాగా నమోదైన కేసుల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 25 కేసులు ఉండగా, గుంటూరు జిల్లాలో 20, కర్నూలు జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 722కి చేరింది. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకూ 20 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకుని 92 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 610 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.













