ఏపీలో 647కు చేరిన కరోనా కేసులు
ఆంధప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో జరిగిన కొవిడ్ 19 పరీక్షల్లో 44 కొత్త కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. కర్నూలు జిల్లాలో 26, తూర్పు గోదావరి జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 3, కృష్ణా జిల్లాలో 6, అనంతపురం జిల్లాలో 3, విశాఖపట్నం జిల్లాలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 647కు చేరింది. కరోనా ఇప్పటి వరకు 17 మంది మృతి చెందగా, 65 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 565 చికిత్స పొందుతున్నారు.













