ఏపీలో 572కు చేరిన కరోనా కేసులు
ఆంధప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో కర్నూలు జిల్లాల్లో 13, నెల్లూరు జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 4, అనంతపురం జిల్లాలో 5, కడప జిల్లాలో ఒక కేసు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 572కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 35 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా బారిన పడి ఇప్పటి వరకు రాష్ట్రంలో 14 మంది మృతి చెందారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 523 మంది చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా గుంటూరు, కర్నూలు జిల్లాలో 126 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.













