ఏపీలో 500 దాటిన కరోనా కేసులు
ఆంధప్రదేశ్‌లో కొత్తగా మరో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధప్రదేశ్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 502కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్ అధికారి బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి బుధవారం ఉదయం వరకు జరిగిన కరోనా నిర్ధారణ పరీక్షలో పశ్చిమ గోదావరిలో 8, కర్నూలులో 6, గుంటూరులో 4, కృష్ణా జిల్లాలలో ఒక్క కేసు నమోదయ్యాయి. ఆంధప్రదేశ్‌లో ఇప్పటివరకు కరోనా బారి నుంచి కోలుకున్న 16 మంది డిశార్జ్ కాగా, 11 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 475 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 118 కరోనా కేసులు నమోదుకాగా, నలుగురు మృతి చెందారు.













