ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 111
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజటివ్ కేసుల సం•్య బుధవారం రాత్రికి 111కు చేరుకుంది. బుధవారం ఒక్కరోజే 67 కొత్త కేసులు బయటపడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. పాజిటివ్ కేసుల్లో ఎక్కువ భాగం ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారేనని తెలుస్తోంది. మార్చి 14 నుంచి 22 వరకు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిలో 80 శాతం మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేగడం తెలిసిందే. మన రాష్ట్రం నుంచి ఢిల్లీకి మత ప్రార్థనలకు వెళ్లిన వారిని ఇరాన్, ఇండోనేషియా నుంచి వచ్చిన వారు కలవడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 11 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.













