ఏపీలో 161కి చేరిన కరోనా కేసులు
ఆంధప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 161కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో ప్రకటించింది. గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు కొత్తగా 12 కేసులు నమోదయ్యాయని తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో నెల్లూరు 8, విశాఖలో 3 ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోదైన వ్యక్తి ఆసుపత్రి నుంచి డిశ్చార్చి అయ్యాడు. లండన్ నుంచి వచ్చిన రాజమహేంద్రవరానికి చెందిన విద్యార్థి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్నట్టు వైద్యులు తెలిపారు. విద్యార్థి కుటుంబ సభ్యులు, స్నేహితుల నమూనాలు అన్నింటిలోనూ నెగిటివ్ ఫలితాలు వచ్చాయని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎస్సీ నయీం హస్మీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ రాఘవేంద్రరావు మీడియాకు తెలిపారు.













