ఏపీలో ఇప్పటివరకు 13 మందికి కరోనా పాజిటివ్
ఆంధప్రదేశ్‌లో ఇప్పటివరకు 13 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. 37కేసుల నివేదికలు రావాల్సి ఉందని తెలిపారు. ఏపీకి ఇప్పటివరకు 29,264 మంది విదేశాల నుంచి వచ్చారని వెల్లడించారు. 29,115 మంది హోం క్వారంటైన్లో ఉన్నారని తెలిపారు. 149 మందికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. క్వారంటైన్ కోసం 23,479 బెడ్లు సిద్ధం చేశామన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు అక్కడే ఉండిపోవాలని నాని సూచించారు. ప్రభుత్వం నుంచి సహాయసహకారాలు అందిస్తామన్నారు. రాష్ట్ర సరిహద్దులో ఉన్నవారికి కల్యాణమండపాలు, హోటళ్లను పూర్తి శానిటైజ్ చేసి వసతి కల్పిస్తామని తెలిపారు.













