ఆరోగ్యశాఖ మంత్రి అటెండరుకు పాజిటివ్
ఆంధప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేషీలో పనిచేసే అటెండరుకు మంగళశారం నిర్వహించిన ట్రూనాట్ పరీక్షల్లో ప్రిజంప్టివ్ పాజిటివ్ వచ్చింది. తుది నిర్ధారణకు నమూనాను వైరాలజీ ల్యాబ్‌కి (ఆర్టీపీసీఆర్ పరీక్షకు) పంపారు. అటెండర్‌ను పిన్నమనేని సిద్దార్ధ వైద్య కళాశాలకు తరలించారు. విషయం తెలిసిన వెంటనే ఉప ముఖ్యమంత్రి నాని, ఆయన భద్రత సిబ్బంది, పేషీలోని మిగతా అధికారులు, ఉద్యోగులు కలిపి మొత్తం 12 మందికీ పరీక్షలు చేశారు. మంగళవారం అర్థరాత్రి వెలువడిన ఫలితాల్లో వారందరికీ నెగెటివ్ వచ్చిందని వైరాలజీ ల్యాబ్ ప్రొఫెసర్ రత్నకుమారి తెలిపారు.













