తిరుపతిలో టీడీపీని టెన్షన్ పెడుతున్న కరోనా!
తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ ఉప ఎన్నికకోసం తెలుగుదేశం పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ నెలారంభం నుంచే లోకేశ్ తిరుపతిలో మకాం వేసి ప్రచారాన్ని సమన్వయం చేస్తున్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూనే తాను కూడా గడపగడపకూ తిరుగుతున్నారు. ఇక చంద్రబాబు కూడా క్యాంపెయిన్ స్టార్ట్ చేయడంతో తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులను కరోనా తెగ టెన్షన్ పెడుతోంది. తిరుపతి ఉపఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన పలువురు నేతలు వరుసగా కరేనా బారినపడ్డారు.
తిరుపతి ఉపఎన్నికను తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వరుస ఎన్నికల్లో ఓటమే ఇందుకు ప్రధాన కారణం. తిరుపతి ఉపఎన్నికలో గట్టిగా పోరాడడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తీసుకురావచ్చని ఆ పార్టీ అధిష్టానం భావించింది. అందుకే పార్టీ అగ్రశ్రేణి నేతలందరినీ ప్రచారబరిలోకి దింపింది. అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల వారీగా సమన్వయ కర్తలను నియమించింది. ప్రచారగడువు ముగిసే లోపు ప్రతి ఇంటినీ కనీసం రెండు సార్లు సందర్శించి ఓటు అడగాలనేది టీడీపీ పెట్టుకున్న లక్ష్యం. పైకి పెద్దగా హడావుడి కనిపించకపోయినా లోలోన మాత్రం టీడీపీ శ్రేణులు తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఇక చంద్రబాబు బరిలోకి దిగిన తర్వాత టీడీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది.
అయితే ఆ పార్టీకి ఒకే ఒక్క ఇబ్బంది ఎదురవుతోంది. ప్రచారం కోసం నియమించిన పలువురు నేతలు కరోనా బారిన పడ్డారు. తాజాగా తిరుపతిలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనే ఉండి ఎమ్మెల్యే రామరాజు కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన వెంటనే ప్రచారాన్ని ముగించుకుని హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఒక్క రామరాజు మాత్రమే కాదు. పలువురు ఇతర నేతలు కూడా కరోనా బారిన పడినవారిలో ఉన్నారు. మాజీ మంత్రి జవహర్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్, సీనియర్ నేతలు వరుపుల రాజా, దామచర్ల సత్య, సంజయ్.. తదితరులకు కరోనా సోకింది. వీళ్లంతా తిరుపతి ప్రచారంలో బిజీబిజీగా గడిపిన నేతలే. ఇలాంటివాళ్లంతా కరోనా బారిన పడడంతో కార్యకర్తలు కాస్త డీలా పడుతున్నారు. అయినా ఎప్పటికప్పుడు ఇతర నేతలకు బాధ్యతలు అప్పగిస్తూ టీడీపీ అధిష్టానం లోటు లేకుండా చూసుకుంటోంది.
ప్రచారం అంటేనే సందడి ఉంటుంది. ఎంత వారించినా కార్యకర్తలు దగ్గరికి వచ్చేస్తుంటారు. నిత్యం వేలాది మందిని కలవాల్సి ఉంటుంది. సభలు, ర్యాలీల్లో జనసందోహాన్ని అదుపు చేయడం కష్టం. భౌతికదూరం పాటించాలని, మాస్కులు ధరించాలని ఎంత చెప్పినా.. ఎవరో ఒకరు, ఏదో ఒక సమయంలో వాటిని ఉల్లంఘిస్తూనే ఉంటారు. అందుకే కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. తిరుపతిలో ప్రచారాన్ని అన్ని పార్టీలూ స్పీడప్ చేశాయి. బహుశా తిరుపతి ఉపఎన్నికల ఎఫెక్టేనేమో.. రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.