ఏపీలో కొత్తగా 8,110 కేసులు.. 67 మంది

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 97,863 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8,110 మందికి కరోనా పాజిజిటివ్‍గా నిర్ధారణ అయ్యింది. కరోనా బారిన పడి 67 మంది మృత్యువాతపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 11,763 మంది మరణించారు. 24 గంటల్లో 12,981 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటి వరకు 16,77,063 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 99,057 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,01,37,627 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా చిత్తూరు జిల్లాలో 11, పశ్చిమగోదావరి జిల్లాలో 9 మంది మృతి చెందారు. విశాఖ జిల్లాల్లో ఏడుగురు మృతి చెందారు. తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఆరుగురు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఐదుగురు, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో నలుగురు, కడప జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు.