ఏపీలో కొత్తగా 6,341 కరోనా కేసులు

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,07,764 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా.. 6,341 మందికి కరోనా పాజిటివ్‍గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో 57 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 12,224కు చేరింది. 24 గంటల్లో 8,486 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 17,59,390 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 67,629 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,09,46,911 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది, గుంటూరులో 8 మంది, తూర్పుగోదావరిలో ఆరుగురు, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళంలో ఐదుగురు చొప్పున, అనంతపురం, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరిలో ముగ్గురు చొప్పున, కర్నూలు, విజయనగరంలో ఇద్దరు చొప్పున మరణించారు.