ఏపీలో 12కు చేరిన కరోనా కేసులు
ఆంధప్రదేశ్‌లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. విశాఖకు చెందిన కరోనా పాజిటివ్ రోగి బంధువుకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 12కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 384 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 317 మందికి నెగిటివ్‌గా తేలింది. మరో 55 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. తిరుపతిలో ఇద్దరు స్విమ్స్ వైద్యులకు కరోనా వైరస్ లక్షణాలు ఉండటంతో వారి నమూనాలు సేకరించారు. అనంతరం ఇద్దరినీ క్వారంటైన్లోకి పంపించారు. కరోనా పాజిటివ్ ఉన్న హైదరాబాద్ వైద్యులను ఇద్దరు స్విమ్స్ వైద్యులు కలిసినట్లు సమాచారం.













