ఏపీ సచివాలయం వద్ద కన్వెన్షన్ హాల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే వివిధ కార్యక్రమాల కోసం ఇప్పటి వరకు ప్రైవేటు ఫంక్షన్, కన్వెన్షన్ హాళ్లను వినియోగిస్తున్నారు. దీనివల్ల అద్దె సహా నిర్వహణ ఖర్చుల కింద భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం సచివాలయం సమీపంలో సొంతగా ఓ కన్వెన్షన్ హాల్‌ను నిర్మించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏపీసీఆర్డీయే సమాయత్తమవుతోంది. అసెంబ్లీ పార్కింగ్ ప్రదేశానికి దగ్గరల్లో రూ.4.37 కోట్ల అంచన వ్యయంతో ప్రి-ఇంజినీర్డ్ స్టీల్ స్ట్రక్చర్‌గా దీనిని నిర్మించాలని ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చారు. దీనికోసం ఇప్పటికే టెండర్‌ను కూడా ఆహ్వానించారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభిస్తారు. ఇది పూర్తయితే అన్ని విధాలా ఉపయుక్తంగా, ఆర్థిక భారం కూడా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.













