Operation Sindhoor: పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఏపీ ప్రజల కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు..

భారతదేశం ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindhoor) విజయవంతమైంది. ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్ కు చెందిన శత్రు శక్తులపై మన సైన్యం కఠినంగా ఎదురుదెబ్బ ఇచ్చింది. దేశ భద్రత విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండే మన దేశ సైన్యం, ఈ దాడిని ఎంతో ధైర్యంగా, నిర్వహించింది. అయితే పాకిస్తాన్ ఎప్పటిలాగానే దొంగ చర్యలకు దిగుతూ మన దేశాన్ని కలవరపెట్టే ప్రయత్నాలు చేసింది. కానీ మన సైనికుల ధైర్యం, పట్టుదల ముందు పాకిస్తాన్ (Pakisthan) ప్రయత్నాలు విఫలమయ్యాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) ఎప్పటికప్పుడు జరిగిన ప్రతి అంశాన్ని తనదైన శైలిలో గమనిస్తూ, దేశ రక్షణ కోసం అవసరమైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో దేశ వ్యాప్తంగా ప్రజలు భారత సైన్యం పై గర్వంతో నిండిపోయారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల విద్య దేశం మొత్తం అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల భద్రత కొరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన సూచనలు జారీ చేసింది. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల రక్షణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) కూడా కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నా..లేదా అక్కడికి ప్రయాణించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఢిల్లీలోని ఏపీ భవన్ (AP Bhavan Delhi) లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ని ఏర్పాటుచేశారు. ప్రజలకు తగిన సమాచారం అందించేందుకు ఈ కంట్రోల్ రూమ్ 24 గంటల పాటు పనిచేయనుంది. ప్రజలు ఈ కంట్రోల్ రూమ్ ద్వారా అత్యవసర సమయాల్లో సహాయం పొందవచ్చు. ఏపీ భవన్ కి సంబంధించిన నంబర్లు 011-23387089, 9871999430, 9871999053. అదనపు సమాచారం కోసం డిప్యూటీ కమిషనర్ (Deputy Commissioner) ఎం.వీ.ఎస్. రామారావు 9871990081, లైజన్ ఆఫీసర్ వి. సురేష్ బాబు 9818395787 నంబర్లకు సంప్రదించవచ్చు. ఈ సమాచారం ఏపీకి చెందిన సుదూర ప్రాంతాల్లో ఉన్న వారితోనూ పంచుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇలాంటప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండటం, అధికారుల సూచనలను పాటించటం అవసరం. ప్రజల భద్రతే మొదటి ప్రాధాన్యతగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.