26 అయినా, 175 అయినా.. ప్రయోజనం లేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలైనా, 26 అయినా, 175 అయినా ప్రయోజనం లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పంటి నొప్పికి తుంటి మీద తన్నినట్టుంది జగన్ పాలన అని అన్నారు. 13 జిల్లాలను విడగొట్టి 26 జిల్లాలు చేసే ఇదే అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ అని డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదమన్నారు. 73, 74 రాజ్యాంగ సవరణల మేరకు గ్రామ పంచాయితీలు, తదితర స్థానిక ప్రభుత్వాలకు విధులు, నిధులు అధికారాలు బదలాయిస్తే అది నిజమైన పాలనావికేంద్రీకరణ అవుతుందని తెలిపారు. గాలేరు నగరి, పోలవరం తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. ప్రత్యేక హోదా సాధించి ప్రతి జిల్లాల్లో పరిశ్రమలు సాధిస్తే అది నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుందని అన్నారు.













