తెలుగుదేశంలోకి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి?
కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ గుడ్‌బై చెప్పే యోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. విజయవాడలో జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన ఏపీలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మధ్యలోనే సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడతారనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే టీడీపీ చెందిన కీలక నేతలు కోట్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలియవచ్చింది. కోట్ల కూడా తన సన్నిహితులతో పార్టీ మారే విషయమై చర్చలు జరిపినట్లు సమాచారం. కర్నూలు ఆయన తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది.













