టీడీపీలోకి కోండ్రు మురళి, ఉగ్రనరసింహారెడ్డి?
కాంగ్రెస్ నాయకులు కోండ్రు మురళీమోహన్, ఉగ్ర నరసింహారెడ్డి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన మురళీమోహన్ మంత్రిగాను పనిచేశారు. ఉగ్రనరసింహారెడ్డి ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ శాసనసభ్యుడు. వీరిద్దరు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి టీడీపీలో చేరేందుకు సంసిద్ధత తెలియజేసినట్టు సమచారం. వారిద్దరూ మాత్రం ముఖ్యమంత్రిని కలవడానికి వేరే కారణాలున్నాయని చెబుతున్నా, త్వరలోనే ఇద్దరూ పార్టీలో చేరనున్నారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.













