టి. సుబ్బరామిరెడ్డికి కీలక పదవి..
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత టి. సుబ్బరామిరెడ్డికి కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి లభించింది. కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీ అయిన వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో సుబ్బరామిరెడ్డికి చోటు దక్కింది. సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడిగా ఆయనను నియమించినట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ప్రస్తుతం వర్కింగ్ కమిటీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు లేరు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుబ్బరామిరెడ్డి నియామకంతో తెలుగువారికి చోటు లభించినట్లయింది. ఆయన రెండు సార్లు లోక్‌సభ సభ్యుడిగా, మంత్రిగా పని చేశారు. ఆయన రాజ్యసభకు కూడా ప్రాతినిధ్యం వహించారు. కాగా కేంద్ర మాజీ మంత్రి కుమారి సెల్జా, ఎంపీ అభిషేక్ మను సింఫ్వీు సీడబ్ల్యూసీ సభ్యులుగా, యూపీసీసీ మాజీ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులయ్యారు.













