మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ, గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తొలినాటి నుంచి సుపరిచితుడైన యువనాయకుడు గౌతమ్‌రెడ్డి తెలిపారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం
ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడు సంతాపం వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి ఎంతో సౌమ్యులు, సంస్కార వంతులని, ప్రజా సమస్యల పట్ల అవగాహన, చేసే పనిపట్ల నిబద్ధత కల్గిన వ్యక్తి అని వెంకయ్య నాయుడు కొనియాడారు. ‘గౌతమ్ రెడ్డి తాత గారి సమయం నుంచి వారి కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. గౌతమ్ రెడ్డి నేనంటే ఎంతో అభిమానం చూపేవారు. అలాంటి వ్యక్తి చిన్న వయసులోనే దూరం కావడం బాధాకరం. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను’ అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.













