సీఎం వైఎస్ జగన్పై సీఐడీకి ఫిర్యాదు
మేదర కులస్థులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని మోసం చేసిన ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఆ సామాజిక సంఘం రాష్ట్ర అద్యక్షుడు నరసింహారావు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష నేత హోదాలో జగన్ తమకు హామీ ఇచ్చి, సీఎం అయ్యాక అసలు పట్టించుకోలేదని నరసింహారావు ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి తమను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. 2019లో ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభలో మేదర కులస్థులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని జగన్ నమ్మించి, గెలిచిన తర్వాత ఆ హామీని మరిచిపోయారని ఆరోపించారు. జగన్ సీఎం అయిన తర్వాత అనేక పర్యాయాలు ఆయనను కలిసి వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. జగన్ వైఖరిని నిరసిస్తూ ఆయనపై, 150 మంది ఎమ్మెల్యేలు, 26 మంది ఎంపీలపై సీఐడీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.













