రాజకీయాలకు.. అలీ గుడ్ బై
సినీనటుడు అలీ వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీనే కాదు, ఇకపై నేను ఏ రాజకీయ పార్టీ మనిషినీ కాదు, ఏ పార్టీ మద్దతుదారుడినీ కాదు. నా సినిమాలు నేను చేసుకుందామని అనుకుంటున్నా అని ఆయన తెలిపారు. ప్రతి ఐదేళ్లకోసారి నేనూ సామాన్యుడిలా ఓటు వేసి వస్తానంతే. రాజకీయాలకు స్వస్తి.. గుడ్ బై అని ప్రకటించారు. ఆయన ఇటీవల వరకు వైసీపీ ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న విషయం తెలిసిందే. నేను రాజకీయాలు చేసేందుకు రాజకీయాల్లోకి రాలేదు. నేను చేస్తున్న దాతృత్వ కార్యక్రమాలకు రాజకీయం తోడైతే మరో పది మందికి ఉపయోగపడగలననే వచ్చా. నేను ఏ పార్టీలో ఉన్నా నాయకుడిని, పార్టీని ఆ పార్టీ అభ్యర్థులను పొడిగానే తప్ప, ఇతర పార్టీల నాయకులను విమర్శించలేదు. వారి వ్యక్తిగత జీవితాల గురించి ఏ రాజకీయ వేదికపైనా మాట్లాడలేదు అని అన్నారు.













