అభివృద్ధి, సంక్షేమంలో రాజీపడరాదు: చంద్రబాబు
‘నీరు-ప్రగతి’ పై సీఎం చంద్రబాబు,సీఎస్ పునేటా టెలికాన్ఫరెన్స్
పాల్గొన్న జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు
అభివృద్ధి,సంక్షేమంలో రాజీపడరాదు: ముఖ్యమంత్రి చంద్రబాబు
నాలుగున్నరేళ్లుగా అద్భుతమైన ఫలితాలు సాధించాం
ప్రజాదరణ పథకాలపై సానుకూలత పెంచాలి.
చిన్న పొరపాటు జరిగినా చేసిన మంచి పోతుంది
కేంద్రం వైఫల్యాలతో రాష్ట్రానికి ఇబ్బందులు.
నరేగా, పోలవరానికి నిధుల విడుదలలో తీవ్రజాప్యం.
అభివృద్ధి,సంక్షేమానికి అడుగడుగునా అడ్డంకులు
అయినా రాజీపడకుండా ముందుకు పోతున్నాం
9వ తేదీన 4లక్షల గృహప్రవేశాలు విజయవంతం చేయాలి.
పించన్ల పెంపు, పసుపు-కుంకుమ 2కు అపూర్వ ప్రజాదరణ
రెండురోజుల్లో 24లక్షల మందికి పించన్ల పంపిణీ. మిగిలినవారికి ఈ రోజు పంపిణీ చేస్తాం.
8వ తేదీ వరకు పించన్ల పంపిణి జరుగుతుంది
పించన్ల పండుగ విజయవంతం చేసిన అందరికీ అభినందనలు
చెక్కుల మార్పిడిలో బ్యాంకర్లు సహకరించాలి. ఆర్ధిక శాఖ రూ.4,100కోట్లు విడుదల చేసింది. బ్యాంకుల్లో రూ.2350కోట్లు డిపాజిట్ చేశాం. నగదు చెల్లింపులో మహిళలను ఇబ్బందులు పెట్టకూడదు
తడిసిన ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం చేయాలి.
జొన్న,మొక్కజొన్న రైతులకు చెల్లింపులు జరపాలి.
ధాన్యం సేకరణ ముమ్మరం చేయాలి
రైతులను మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
మిక్సింగ్ ప్లాంట్లపై నిఘా ముమ్మరం చేయాలి.
గత ఏడాదికన్నా రిజర్వాయర్లలో నీటి మట్టం 6% తక్కువ. సమర్ధ నీటి నిర్వహణ జరపాలి.
రబీ సీజన్ లో 87% మాత్రమే సాగు జరిగింది. పంట దిగుబడులు తగ్గకుండా శ్రద్దపెట్టాలి.
కరవు మండలాల్లో ఉపాధి పనులు ముమ్మరం చేయాలి. పనిదినాలు మెరుగుపరచాలి.
రాబోయే ఎన్నికలు మనందరికి ఫైనల్ పరీక్షలు.
ఐదేళ్ల మన కృషికి ఈ పరీక్షా ఫలితాలే గీటురాయి
సుప్రీం న్యాయమూర్తుల ప్రశంసలు మన కృషికి గుర్తింపు
ఇదే స్ఫూర్తితో రాబోయే 6నెలలు పనిచేయాలి. అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలి.













