అమరావతిలో కలెక్టర్ల సదస్సు ప్రారంభం
విజయవాడ నగరంలోని గ్రీవియెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ సదస్సును ప్రారంభించారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. తొలిరోజు మౌలిక వసతులు, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్, ఆదాయార్జన శాఖలపై చర్చ జరగనుంది. రెండోరోజు శాంతిభద్రతలు, కేసుల పురోగతి, నిరుద్యోగ భృతిపై చర్చ జరగనుంది. సీసీఎల్ఏ అనిల్ చంద్ర పునీటా సదస్సు ప్రారంభం అనంతరం స్వాగతోపన్యాసం చేశారు. అధునాతన సాంకేతికతను, సమాచార సాంకేతికత వినియోగాన్ని సమర్ధంగా వినియోగించుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుంటారిన అనిల్ చంద్ర పునీటా పేర్కొన్నారు.













