రెండోరోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభం
విజయవాడలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రెండోరోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. రియల్‌టైమ్ గవర్నెన్స్‌పై సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాలూ రియల్‌టైమ్ గవర్నెన్స్ పరిధిలోకి రావాలని అన్నారు. ల్యాండ్ హబ్, క్లౌడ్ హబ్, ఏపీసీయం కనెక్ట్ కింద అవినీతిని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. పరిష్కార వేదిక పెట్టి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరిస్తున్నాం. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి. అందులో కాలయాపనకు తావివ్వరాదు. ఈ ఏడాదిని ‘ఈ-ప్రగతి’ సంవత్సరంగా ప్రకటించినట్లు తెలిపారు. ‘ఈ-ప్రగతి’ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లామన్నారు. ఏదైనా ఒక కళాశాల తీసుకుని విద్యార్థులకు ఈ-ప్రగతిపై శిక్షణను ఇవ్వాలన్నారు. ఆలస్యం చేయవద్దని చెప్పారు. ప్రభుత్వ పనితీరుపై 58 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని ముఖ్యమంత్రి వెల్లడించారు.













