Ramanaidu Studio :రామానాయుడు స్టూడియోకు కలెక్టర్ నోటీసులు
విశాఖపట్నం (Visakhapatnam) లోని రామానాయుడు స్టూడియో (Ramanaidu Studio )కు నోటీసులు జారీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రెండు వారాల సమయం ఇస్తామని, వారి వివరణ తర్వాత చర్యలు ఉంటాయని అన్నారు. రామానాయుడు స్టూడియోకు చిత్ర నిర్మాణ పరిశ్రమ, స్టూడియో నిర్మాణం కోసం ప్రభుత్వం 34 ఎకరాలకు పైగా భూమిని కేటాయించింది. అందులో 15.17 ఎకరాలు హౌసింగ్ లేఅవుట్ కోసం మార్పు చేయాలని స్టూడియో యాజమాన్యం కోరింది. అది నిబంధనలకు విరుద్ధమని, నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అని కలెక్టర్ వివరించారు. రామానాయుడు స్టూడియోకు కేటాయించిన భూముల వ్యవహారంపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నివాస స్థలాలుగా మార్పు చేయాలని తలపెట్టిన 15.17 ఎకరాల భూ కేటాయింపు రద్దు చేయాలని నిర్ణయించింది. నిర్దేశించిన ప్రయోజనం కోసం ఇచ్చిన భూమిని అప్రయోజనం కోసం వినియోగిస్తే రద్దు చేయాలన్న సుప్రీంకోర్టు (Supreme Court ) తీర్పు, ప్రకారం రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోదియా (R.P. Sisodia) ఉత్తర్వులు జారీ చేశారు. సిసోదియా ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ తాజాగా నోటీసులు జారీ చేసిందుకు సిద్ధమయ్యారు.













