వారి సేవలు ప్రశంసనీయం : జగన్
రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు, కొవిడ్ ఆసుపత్రుల వైద్యులతో ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కరోనాపై యుద్ధంలో అందిస్తున్న సేవలు చాలా ప్రశంసనీయం. వైద్యులు, నర్సులు, పారామెడికల్, పారిశుద్ధ్య సిబ్బంది హృదయపూర్వకంగా సేవలందిస్తున్నారు. రిస్క్ ఉంటుందని తెలిసీ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. భయం ఉన్నా వైద్య సేవలు అందిస్తున్నందుకు సెల్యూట్ చేస్తున్నా. ఢిల్లీ నుంచి వచ్చిన వారి కారణంగానే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. వారందరినీ గుర్తించి క్వారంటైన్, ఐసోలేషన్లో ఉంచాం. మొత్తం మీద పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని నమ్ముతున్నా అని ముఖ్యమంత్రి తెలిపారు.













