28న విశాఖలో సీఎం జగన్ పర్యటన
ఈ నెల 28న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ నగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ మేరకు అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన తర్వాత తొలిసారి జగన్ పర్యటించనున్నారని అన్నారు. ఈ నెల 28న నగరానికి వస్తున్నారని ఆయన తెలిపారు. దాదాపు 3 గంటల పాటు జగన్‌కు స్వాగత కార్యక్రమాలు ఉంటాయని.. చరిత్రలో నిలిచిపోయేలా స్వాగత కార్యక్రమం ఉంటుదన్నారు. 24 కిలోమీటర్ల మేర మనవహారం నిర్వహిస్తామన్నారు. భూముల వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఇప్పటి వరకు ఏ విషయంలోనూ అధికారులతో తాను పైరవీలు చేయలేదన్నారు. తన పేరుతో ఎవరైనా వస్తే క్రిమినల్ కేసులు పెట్టండని అధికారులకు సూచించారు. ల్యాండ్ సెటిల్మెంట్లలో తన పాత్ర లేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో తనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి ఆస్తులు లేవన్నారు. ఏ వెంచర్లో కూడా భాగస్వామ్యం లేదని తేల్చి చెప్పారు.













