‘జగనన్న తోడు’ లబ్ధిదారుల ఖాతాల్లో రూ.16.36 కోట్లు జమ
ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ కార్యక్రమాల అమల్లో భాగంగా సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి.. కుల,మత, ప్రాంతం, పార్టీలతో నిమిత్తం లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ‘జగనన్న తోడు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సంక్షేమ పాలనను చూసి టీడీపీ ఓర్వలేకపోతోందన్నారు. ‘జగనన్న తోడు’ కార్యక్రమంలో భాగంగా లబ్ధి దారుల వడ్డీ సొమ్మును బ్యాంక్ ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జమ చేశారు. బుధవారం క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి రూ.16.36 కోట్లు లబ్ధి దారుల ఖాతాల్లో జమ చేశారు. తొలి విడత ‘జగనన్న తోడు’ కింద రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 4.5 లక్షల మంది చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకు 9.05 లక్షల మందికి రూ.950 కోట్ల రుణాలను ప్రభుత్వం అందించింది. ఈ సందఠరేగా సీఎం మాట్లాడుతూ పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను కళ్లార చూశానని సీఎం అన్నారు. చిరు వ్యాపారులు, తోపుడు బండ్లు, హస్తకళా వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తుల కళాకారులకు ‘జగనన్న తోడు’ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు.













