జులై 1 నుంచి ప్రజా దర్బార్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలోనే ఆయన తనయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పయనిస్తున్నారు. జులై 1 నుంచి వైఎస్ జగన్ ప్రజాదర్బార్ నిర్వహించబోతున్నారు. తాడేపల్లి నివాసం వద్ద ప్రతిరోజూ సీఎం ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. రోజూ గంటపాటు ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని జగన్ పరిష్కార మార్గం చూపనున్నారు. కాగా ఇప్పటికే ప్రజాదర్బార్ నిర్వహణకు సీఎం కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో బేగంపేట క్యాంపు కార్యాలయంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక వైఎస్ జగన్ కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నారు. సీఎంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా స్పందన కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాసమస్యల స్వీకరణకు స్పందన కార్యక్రమం నిర్వహణ జరగాలని అధికారులను సీఎం ఆదేశించారు. స్పందన ద్వారా వినతులు స్వీకరణకు కలెక్టర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.













