శుభవార్త చెప్పిన ఏపీ సీఎం
ఆంధ్రప్రదేశ్‌లో సొంతిల్లు లేని వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. ప్రజావేదికలో జరిగిన కలెక్టర్ల సదస్సు వేదికగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ఇంటిస్థలం లేనివారు ఈ రాష్ట్రంలో ఎవరూ ఉండకూడదన్నారు. ఈ ఉగాదికి 25 లక్షల ఇంటి స్థలాలు మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామన్నారు. నిజమైన లబ్దిదారులను అధికారులను గుర్తించాలని పట్టాలు ఇచ్చేటప్పుడు ప్లాటు ఎక్కడుందో చూపించాలన్నారు. ఇందుకు గాను ఒక డిస్ట్రిక్ పోర్టల్‌ను ప్రారంభింంచాలని, ప్రతి ఒక్క అంశాన్ని ఆ పోర్టల్‌లో పొందుపర్చాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా సూచించారు.













