ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. జూన్ 1 నాటికి వారికి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సీఎం జగన్ ప్రొబేషన్‌పై నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 30 తేదీ కల్లా ప్రక్రియ పూర్తి కావాలని, జులై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలని స్పష్టం చేశారు. మిగిలిన 25 శాతం ఉద్యోగులు ప్రొబేషన్ పరీక్షలు కూడా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. పీఆర్సీ అమలు సహా, ఉద్యోగుల కోసం ప్రకటన చేశాం. జూన్ 30 లోగా కారుణ్య నియామకాలు చేయాలి. యుద్ద ప్రతిపాదికన కారుణ్య నియమకాలు ఇవ్వాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఖాళీలను వినియోగించుకోవాలన్నారు.
జగనన్న స్మార్ట్‌టౌన్‌షిప్స్‌లో రిబేటుపై స్థలాలు కేటాయించాం. 10 శాతం స్థలాలను 20 శాతం రిబేటుపై కేటాయించాం. స్థలాల కేటాయింపునకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించాలి. స్థలాలు కోరుతున్న ఉద్యోగుల పేర్లను మార్చి 5 లోగా స్థలాలు కోరిన ఉద్యోగుల పేర్లను రిజిస్ట్రేషన్ చేయాలి. దానికొచ్చిన డిమాండ్ బట్టి తదుపరి చర్యలు తీసుకుంటాం. సేకవరించిన స్థలంలో 5 శాతం స్థలాలు పెన్షనర్లకు రిజర్వ్ చేయాలి. అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలని అన్నారు. అలాగే ఉద్యోగుల సర్వీసును 60 62 ఏళ్లకు పెంచాం. ఉద్యోగులకు మంచి జరగాలని సర్వీసును పెంచాం. దీనికి సంబంధించి చర్యలు కూడా తీసుకోవాలన్నారు.













