అధికారమంటే అహంకారం కాదు.. ప్రజలపై : వైఎస్ జగన్
అధికారమంటే అహంకారం కాదు ప్రజలపై మమకారమంటూ నిరూపించామని వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ అన్నారు. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ సమీపంలో వైసీపీ ప్లీనీరిని జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ప్రజల కోసమే బతికామని అన్నారు. 2009 నుంచి ఇప్పటి వరకు ఎన్నో సవాళ్లు ఎదుర్కొమన్నారు. ఈ ప్రయాణంలో తనను వెన్నుదన్నుగా నిలిచిన ప్రతి కార్యకర్త, అభిమానికి సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. 2011లో పార్టీ పెట్టుకున్నాం. ఈ ప్రయాణంలో ఎన్ని ముళ్లున్నా, ఎన్ని రాళ్లు పడినా ఎన్ని వ్యవస్థలు మనపై కత్తిగట్టినా ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఈ కట్టుకథలకు విలువ లేదన్నారు. నాన్న చనిపోయిన తర్వాత ఈ జగమంత కుటుంబం ఏనాడూ నా చేయి వీడలేదన్నారు.
2019లో చరిత్రలో కనీవినీ ఎరుగని మెజార్టీని ప్రజలు ఇచ్చారు. దేవుడు, ప్రజల ఆశీస్సులతో 175 స్థానాలను గాను ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి అధికారం అప్పగించారు. అదే సమయంలో మన పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను కొన్నవారిని దేవుడు, ప్రజలు అదే సీట్లకు పరిమితం చేశారు. అధికారంలోకి వచ్చాక పేదలు, సామాన్యులు, అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల కోసమే బతికాం. చెప్పిన మాట నిలబెట్టుకునేందుకు ప్రతిపక్షం తప్పించాం. ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించి పాలన సాగిస్తున్నామన్నారు. తమ మేనిఫెస్టో దొరకకుండా మాయం చేసిన పార్టీ టీడీపీ. యూట్యూబ్ వైబెసైట్ల నుంచి వాళ్లు తీసేయించారు. మనం మాత్రం మేనిఫెస్టోలోని 95 శాతం హామీలను అమలు చేసి గడపగడపకు వెళ్లి ప్రతి మనిషిని కలుస్తున్నాం అని అన్నారు.













