ఆందరికీ ఆయన ఆదర్శంగా నిలిచారు : వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మాజీ సభ్యుడు కొణిజేటి రోశయ్య మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ విద్యార్థి నాయకుడు స్థాయి నుంచి శాసస మండలి సభ్యుడుగానూ, శాసన సభ్యుడుగానూ, మంత్రిగానూ, ఎంపీగానూ, ముఖ్యమంత్రి, చివరికు గవర్నర్‌గానూ కొనసాగిన ఘనత రోశయ్యదన్నారు. ఆయన ఏ బాధ్యత నిర్వర్తించినా అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద రోశయ్య మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ ఆర్థిక మంత్రిగా రోశయ్య కొనసాగారని తెలిపారు. వైఎస్, రోశయ్య ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండేవారన్నారు. అలాంటి రోశయ్య మన మధ్య లేకపోవడం బాధకరమని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు.













