కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న సీఎం జగన్

ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‍మోహన్‍రెడ్డి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. గుంటూరులోని భారత్‍పేటలోని 140వ వార్డు సచివాలయానికి సతీమణి వైఎస్ భారతితో కలిసి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం వార్డు / గ్రామ సచివాలయాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. మూడు నెలల్లో రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు. గ్రామాల్లో వ్యాక్సినేషన్‍పై వాలంటీర్లకు అవగాహన కల్పిస్తారు. ఇంటింటికి వెళ్లి 45 ఏళ్లు దాటినవారి వివరాలను వాలంటీర్లు దగ్గరుండి సేకరిస్తారు. ఏ రోజు వ్యాక్సినేషన్ జరుగుతుందో ముందుగానే వాలంటీర్లు చెబుతారు. ప్రతీ మండలంలోని పీహెచ్‍సీల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించనున్నారు అని తెలిపారు.