గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా విషయంలో ఆంధప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్‌పై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి ఆదివారం ఉదయం సీఎం జగన్ కీలక అధికారులతో సమావేశమై కరోనాపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇంతలోనే స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కమిషనర్ ప్రకటించగానే అడ్వకేట్ జనరల్‌ను వెంటబెట్టుకుని రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయం, ఇతర పరిణామాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకత, ఇప్పటి వరకూ పూర్తయిన ఎన్నికల పక్రియను వివరించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, నివారణకు తీసుకున్న, తీసుకుంటున్న చర్యలను కూడా వివరించినట్లు సమాచారం.













