గవర్నర్ కు సీఎం వైఎస్ జగన్ ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతితో కలిసి రాజ్‌భవన్‌లో అరగంటపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సమకాలీన రాజకీయ అంశాలపై గవర్నరు, ముఖ్యమంత్రి చర్చించుకున్నట్లు సమాచారం. మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న విషయాన్ని గవర్నరు దృష్టికి ముఖ్యమంత్రి తీసుకురావడంతో పాటు సమావేశాలకు ఆయన నుంచి అనుమతి తీసుకున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలని గవర్నరును సీఎం ఆహ్వానించారు. మరోవైపు జిల్లాల పునర్విభజనకు చేపడుతున్న చర్యలను గవర్నరుకు వివరించారు. ఈ కారక్రమంలో ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, రాజ్‌భవన్ సంయుక్త కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్ పాల్గొన్నారు. తొలుత ముఖ్యమంత్రి దంపతులకు గవర్నరు ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోడియా స్వాగతం పలికారు.













