శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్
విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడ ఉన్న రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని ఆయన సందర్శించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తాండవమూర్తి, దాసాంజనేయ స్వామి ఆలయాలను దర్శించుకున్న ముఖ్యమంత్రి అనంతరం రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదపండితులను జగన్ సత్కరించారు. ఆ తర్వాత శారదాపీఠం వైబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించారు. నేటి నుంచి శ్రీ శారాద పీఠం వార్షిక మహోత్సవాలు ప్రారంభమవ్వగా.. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతిల ఆధ్వర్యంలో అయిదు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి.













