విత్తనాల కొరతపై ఆరా తీసిన సీఎం వైయస్.జగన్
ఇబ్బంది లేకుండా చేయగలరా? అంటూ అధికారులను ప్రశ్నించిన సీఎం. విత్తనాల కొరతను అధికారుల దృష్టికి తీసుకొచ్చిన మంత్రులు. విత్తనాల కొరత లేకుండా చూడాలని అధికారులకు సీఎం ఆదేశం. విత్తనాలకు సంబంధించిన రూ.360 కోట్లు నిధులను గత ప్రభుత్వం డైవర్ట్ చేసింది, దీనివల్ల ఇప్పుడు కొన్ని సమస్యలు వచ్చాయన్న సీఎం. మనం వచ్చి నెలరోజులే అయ్యింది, ఈ సమస్యను నివారించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి.
గత ప్రభుత్వ ప్రణాళికా లోపంకారణంగా ఈ సమస్య వచ్చిందన్న వ్యవసాయశాఖమంత్రి కన్నబాబు. వచ్చే ఏడాదికోసం అవసరమైన దానికంటే 10శాతం ఎక్కువ సేకరించండి. నేషనల్ సీడ్ కార్పొరేషన్ ద్వారా విత్తనాల సమస్యను నివారిస్తామన్న వ్యవసాయశాఖ కార్యదర్శి. విత్తనాలకు నిధులు విడుదల విషయంలో ఉదారంగా ఉండాలని ఆర్థికశాఖ అధికారులకు సీఎం ఆదేశం.
ప్రత్యామ్నాయ విత్తనాలైనా రైతులకు అందుబాటులో ఉంచాలన్న సీఎం. వచ్చే 5 ఏళ్లకు సరిపడా విత్తనాలపై సరైన ప్రణాళిక తయారుచేయాలన్న సీఎం. గుంటూరు సహా కొన్ని జిల్లాల్లో కేజీ మిర్చి విత్తనాల ధరను రూ.1లక్ష నుంచి లక్షన్నరకు అమ్ముతున్నారంటూ తమ దృష్టికి వచ్చిందన్న వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. పత్తి మాదిరిగానే పత్తికి రిటైల్ మాగ్జిమమ్ ప్రైస్ పెట్టలేదన్న అధికారులు. విత్తనాల నాణ్యతకు ల్యాబ్లు పెట్టడం ఒక పద్ధతి అన్న సీఎం. రెండోది ప్రభుత్వమే నేరుగా కంపెనీలతో ఎంఓయూ చేసుకోవడం అన్నది రెండో పద్ధతి అన్న సీఎం. వీటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పడుతుందన్న సీఎం. మిర్చి విత్తనాలకూ ఎంఆర్పీని నిర్ణయిద్దామన్న సీఎం.













