ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులకు శుభవార్త
గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడుగారితో పనిచేసి ఉండటం వల్ల కొంతమంది ఉద్యోగుల ఆయనతో సన్నిహితంగా ఉండి ఉండవచ్చు. ఏదైనా పనులు చేయించు కోవడం కోసం గత ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది… కాబట్టి నేను ఆ విషయాన్ని తప్పుగా భావించనని మీ అందరికీ చెబుతున్నాను. ముఖ్యమంత్రి గారితో సన్నిహితంగా ఉండటం ద్వారానే వారితో ఉద్యోగ సంఘాలు ఏవైనా పనులు చేయించుకునే పరిస్థితి ఉంటుంది.. అందువల్ల నేను ఆయా అంశాలను పట్టించుకోనని చెబుతున్నాను.
ప్రతి విభాగంలో ప్రతి సెక్రటరీ, హెచ్ వోడీ దగ్గర ఈ మేనిఫెస్టో ఉండాలని వారందరికీ చెప్పాం. మళ్లీ ఎన్నికల వచ్చే నాటికి ఈ మేనిఫెస్టోలో ప్రతి పని.. ప్రతి అంశం చేశామని చెప్పి ప్రజల దగ్గరకు వెళ్లి ఓటు అడిగే పరిస్థితి ఉండాలి. ప్రజలు మంచి ప్రభుత్వాన్ని కోరి ఓటు వేస్తారు. మంచి ప్రభుత్వం అంటే నేనొక్కడినే కాదు.. మీ అందరిని కలుపుకున్నాదే మంచి ప్రభుత్వం.
మేనిఫెస్టోలోని అన్ని అంశాలు అమలు కావాలని సెక్రటరీలు అందరికీ చెప్పాం. మేనిఫెస్టోలో చెప్పిన అంశాల్లో ఉద్యోగస్తులకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. కేబినెట్ లో ఐఆర్ 27 శాతం చేస్తాం. సీపీఎస్ ను కూడా రద్దు చేస్తాం… కేబినెట్ లో ఇవన్నీ పూర్తి చేసి ఎలా చేయాలన్న అంశంపై ముందుకు వెళ్లేందుకు కమిటీని ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వంలో కాంట్రాక్టు పద్దతిలో పని చేస్తున్న వారికి సంబంధించి వారి అర్హత, అనుభవంల ఆధారంగా వీలైనంత ఎక్కువ మంది ప్రభుత్వంలోకి తీసుకుంటాం. ఈ అంశంపై కేబినెట్ లో పెట్టి… ఈ అంశంపై ముందుకు వెళతాం. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచుతాం. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలకు సంబంధించి భయపడాల్సిందేమీ లేదు.. రేపు కేబినెట్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సమస్య లేకుండా ఏం చేస్తామనేది కేబినెట్ లోచెబుతాం.













