ఢిల్లీలో రెండో రోజు సాగుతున్న సీఎం జగన్ పర్యటన

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. మొదటి రోజు పర్యటనలో భాగంగా సీఎం జగన్ అటవీ, పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత కేంద్ర జలవనరుల మంత్రి షెకావత్ తో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు పురోగతిని సీఎం ఆయనకు వివరించారు. ఆ తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని అభివృద్ధి పనులకు సహకరించాలని.అమిత్ షా కు విజ్ఞప్తి చేశారు. అలాగే. ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలు కు తరలించేందుకు రీనోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం కోరారు. దీంతో పాటు పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా తాము 3 రాజధానులను ఏర్పాటు చేయాలని విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని, అందుకు సహకరించాలని. అమిత్ షా ను సీఎం కోరారు. అలాగే విద్యుత్ సంస్కరణల్లో తమ రాష్ట్రం ముందు వరుసలో ఉందని, అయితే విద్యుత్ పరిస్థితి బాగో లేదని, అందుకే తమకు సహకరించాలని పేర్కొన్నారు. విద్యుత్ సంస్థ దాదాపు 50 వేల కోట్ల అప్పుల్లో ఉందని, కేంద్రం సహాయం చేయాలని జగన్ కోరారు.
ఇక రెండో రోజు పర్యటనలో భాగంగా సీఎం జగన్ మొదట ఉక్కు, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయ్యారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్, పెట్రో వర్సిటీ ఏర్పాటుపై చర్చించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపేయాలని కేంద్ర మంత్రిని సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రత్యామ్నాయాలను చూడాలని కోరారు. ఆ తర్వాత సీఎం జగన్ కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తో కూడా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టుల గురించి చర్చించారు.