కృష్ణా నదిపై మరో బ్యారేజీ.. ప్రజలపై సీఎం జగన్ హామీల వర్షం..
బాపట్ల జిల్లా పర్యటనలో భాగంగా ప్రజలపై సీఎం జగన్ హామీలు గుప్పించారు. కృష్ణానదిపై మరో బ్యారేజీ రానున్నట్లు ప్రకటించారు. వేమూరు నియోజకవర్గంలో పర్యటించిన జగన్ ఈమేరకు ప్రకటన చేశారు. భట్టిప్రోలు మండల పరిధిలోని ఓలేరు-తూర్పు పాలెం గ్రామాల మధ్య కృష్ణానదిపై 4.96టీఎంసీల సామర్థ్యంలో మరో బ్యారేజీ నిర్మించనున్నామని, దీనికి రూ.2,500 కోట్లతో ప్రతిపాదనలు పూర్తయినట్లు ఆయన వెల్లడించారు. వాటితో పాటు జంపని చక్కెర కర్మాగారం కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని, 1800 ఎకరాల లంక భూములకు పట్టాలు ఇచ్చి 3,749 మంది రైతులకు మేలు చేస్తామని, నియోజకవర్గంలో రూ.17కోట్లతో రహదారుల నిర్మాణం చేపడతామని హామీలు ఇచ్చారు. అంతేకాకుండా యడ్లపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలను జూనియర్ కాలేజీగా ఆధునీకరిస్తామని తెలిపారు.













